ప్రత్యేక హోదా కోసం హిజ్రాల పస్తు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రత్యేక హోదా కోసం హిజ్రాల పస్తు

April 9, 2018

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం అన్ని వర్గాలూ ఉద్యమిస్తున్నాయి. రాజకీయ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు.. అందరూ ఏకమవుతున్నారు. తాజగా వీరికి హిజ్రాలు కూడా తోడయ్యారు. విశాఖపట్నం జిల్లా యలమంచిలి పట్టణంలో ట్రాన్స్‌జెండర్లు  దీక్ష చేశారు. అధికార టీడీపీ నిర్వహిస్తున్న శిబిరంలో పాల్గొన్నారు.

విశాఖలోని శేషుకొండ కాలనీకి చెందిన వీరు అంతకుముందు ర్యాలీగా శిబిరం వద్దకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని తమదైన శైలిలో దుమ్మెత్తి పోశారు. ‘మమ్నల్ని తేలికగా తీసుకోకండి. మేమూ ఉద్యమాలు చేస్తాం. కేంద్రం మెడలు వంచుతాం..’ అని హెచ్చరించు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు.