వరంగల్‌లో దారుణం.. సెక్స్ కోసం వేధిస్తోందని హిజ్రా హత్య - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్‌లో దారుణం.. సెక్స్ కోసం వేధిస్తోందని హిజ్రా హత్య

May 13, 2020

Hijra Mystery in Warangal

వరంగల్ జిల్లాలో ఓ హిజ్రా దారుణ హత్యకు గురైంది. కాకతీయ యూనివర్సిటికీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలు హిజ్రా హరిణిగా గుర్తించారు. దీని వెనక సురేష్ అనే కారు డైవర్ ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. పలు కీలక విషయాలను ఈ సందర్భంగా రాబట్టారు.

హరిణికి కొంత కాలం క్రితం సురేష్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో సురేష‌ను తరుచూ లైంగికంగా వేధిస్తూ ఉండేదని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో వేధింపులు ఎక్కువ కావడంతో హతమార్చినట్టుగా చెబుతున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తదుపరి దర్యాప్తు చేపట్టారు. లైంగిక వేధింపులేనా..? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. కాగా లాక్‌డౌన్ కారణంగా చాలా రోజులుగా క్రైం రేటు తగ్గిపోయింది. ఇటీవల కొన్ని సడలింపులు ఇవ్వడంతో నేేరాలు చోటు చేసుకుంటూ ఉండటం పలువురుని కలవరపరుస్తోంది.