విజయవాడలో హిజ్రా చేసిన పనికి మీరు ఆశ్చర్యపోతారు - MicTv.in - Telugu News
mictv telugu

విజయవాడలో హిజ్రా చేసిన పనికి మీరు ఆశ్చర్యపోతారు

March 18, 2022

bfcbfbc

సాధారణంగా హిజ్రాలంటే దుకాణాల వద్ద అడుక్కోవడం, మగవారిని ఇబ్బంది పెడుతూ డబ్బులు గుంజడం వంటి పనులు చేస్తారని మనలో చాలా మంది అనుకుంటారు. అందులో కొంత వరకు వాస్తవమున్నా అందరూ అలా ఉండరు. మంచి మనసున్న వాళ్లు చాలా మంది ఉంటారు. తాజగా అలాంటి సన్నివేశం ఒకటి విజయవాడ నగరంలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన కళ్యాణి అనే హిజ్రా బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగే వాహనాల వద్ద యాచిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అదే చౌరస్తాలో యాచిస్తూండే ఇద్దరు వద్ధులను, వారితో ఉన్న ఓ బాలుడిని గమనించేది. వ‌ద్ధుడికి ఒక కాలు లేకపోవడంతో పనిచేయలేని పరిస్థితి నెలకొంది. దాంతో వృద్ధురాలు, బాలుడిని తీసుకొని యాచించేది. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బు వారికి సరిపోయేవి కావు. ఎన్నో సార్లు చాలీ చాలని భోజనం చేస్తూ చౌరస్తా వద్దే పడుకునేవారు. ఈ నేపథ్యలో కళ్యాణి స్పందించి తోటి హిజ్రాలతో కలిసి కూడబెట్టిన రూ. 20 వేలను వారికి సాయంగా అందించింది. చిన్న బాలుడు ఉన్నాడు కాబట్టి, ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకోమని సూచించింది.