8 మందిని పెళ్లాడిన హిజ్రా..ఆ మగానుభావులెలా బుట్టలో పడ్డారో!
ఐఏఎస్ అధికారిని అంటూ ఓ హిజ్రా ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుంది. అందులో పారిశ్రామికవేత్తలు, పోలీసులు కూడా ఉన్నారు. కొన్ని రోజులపాటు వారితో ఉండి, తనకు కావాల్సిన డబ్బులు, నగాలను వసూలు చేసుకొని పరారైంది. దాంతో తాము మోసపోయాము అని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
"తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లాలో ఈ ఘటన జరిగింది. బబితా రోజ్ అనే ఓ హిజ్రా ఐఏఎస్ అధికారిని అంటూ, ఆ శాఖ ఉన్నతాధికారులతో మంచి సంబంధాలున్నాయని పలువురిని మోసం చేసింది. తన మాయమాటలతో 8 మందిని పెళ్లాడింది. మరో 50 మందిని వివిధ రకాలుగామోసం చేసిందంటూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. హిజ్రా పెళ్లి చేసుకున్నవారిలో పారిశ్రామికవేత్తలు, పోలీసులు సహా 8 మంది ఉన్నారు. వివాహం చేసుకొని నగదు, నగలతో పరారైంది. హిజ్రాపై తిరుచ్చి, కడలూరు, కళ్లకుర్చి, కోయంబత్తూర్, మడత్తుకుళం, తిరుప్పూర్, విరుదునగర్, రాజపాళయం, నాగర్‌కోయిల్ తదితర ప్రాంతాల్లో మోసానికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నాం" అని తిరుచ్చి జిల్లా ఎస్పీ సుజిత్ కుమార్ తెలియజేశారు.
ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'ఆ మగానుభావులెలా హిజ్రా బుట్టలో పడ్డారో' అంటూ కామెంట్ల చేస్తున్నారు. మరికొందరు హిజ్రాలు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారా? అని ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనప్పటికి తమినాడులో ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు, మోసపోయిన బాధితులు నిందితురాలి కోసం తెగ గాలిస్తున్నారు.