హిజ్రాను తగలబెట్టిన హిజ్రాలు.. మాదాపూర్‌లో - MicTv.in - Telugu News
mictv telugu

హిజ్రాను తగలబెట్టిన హిజ్రాలు.. మాదాపూర్‌లో

October 12, 2020

Hijras who burnt Hijra .. in Madhapur

తోటి సమాజం తమను చిన్న చూపు చూస్తుందని.. భౌతిక దాడులకు పాల్పడతారని వాళ్లలో వారు ఎంతో అన్యోన్యంగా ఉంటారు హిజ్రాలు. అయితే వారి మధ్య అంత పెద్ద అగాధం ఏం వచ్చిందో గానీ, ఓ హిజ్రాను తోటి హిజ్రాలే తగులబెట్టిన ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హిజ్రాపై పెట్రోల్ పోసి మరో హిజ్రా వర్గం నిప్పంటించారు. ఎర్రగడ్డ అవంతి నగర్‌కు చెందిన హరి ప్రసాద్ అలియాస్ హంస(28)కు చందానగర్‌లో నివాసం ఉంటున్న కొంత మంది హిజ్రాలతో పడటంలేదు. గత కొంత కాలంగా వారి మధ్య  విబేధాలు ఉన్నాయి. 

ఆదివారం రాత్రి హంసకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో మాట్లాడుకుందాం రా అని చెప్పారు. దీంతో హంస అక్కడికి అక్కడికి వెళ్లింది. ఆమెపై మరికొంతమంది హిజ్రాలు పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడినుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ హిజ్రా హంసను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హిజ్రా హంస ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా, ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.