Himachal Cable Car Stuck: All 11 Passengers Rescued After 3 Hours
mictv telugu

గాలిలో ఆగిపోయిన కేబుల్ కార్.. ఆ 11 మంది అందులోనే..

June 20, 2022

Himachal Cable Car Stuck: All 11 Passengers Rescued After 3 Hours

ఎత్తైన ప్రాంతంలో రోప్‌ వేపై ఒక కేబుల్‌ కార్‌ నిలిచిపోయింది. టెక్నికల్ ప్రాబ్లెం వల్ల అది ముందుకు కదలలేదు. దీంతో అందులో ఉన్న 11 మంది పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పర్వానూలోని టింబర్‌ ట్రెయిల్‌ ప్రైవేట్‌ రిసార్ట్‌కు చెందిన రోప్ వే మీద వెళ్లే కేబుల్‌ కార్లు ఇక్కడ ఎంతో ప్రసిద్ధి. శివాలిక్ పర్వత శ్రేణుల మీదుగా ఇవి ప్రయాణిస్తూ పర్యాటకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. అయితే సోమవారం మధ్యాహ్నం 11 మంది పర్యాటకులు ఎక్కిన ఓ కేబుల్ కార్ ఎత్తైన కొండ ప్రాంతంలో ఆగిపోయింది. వీరిని రక్షించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. దాదాపు మూడు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత.. ఆ 11 మందిని సురక్షితంగా కిందకు దింపారు.

రెండు నెలల క్రితం ఝార్ఖండ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దేవ్‌గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్‌ వే ద్వారా నడిచే కేబుల్ కార్లు సాంకేతికలోపంతో ప్రమాదానికి గురయ్యాయి. కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.