ఆవులకు రూ. 500 పింఛను.. కొత్త పథకం షురూ  - MicTv.in - Telugu News
mictv telugu

ఆవులకు రూ. 500 పింఛను.. కొత్త పథకం షురూ 

August 3, 2020

Himachal pradesh government  be provided ₹500 per cow per month as maintenance allowance.

వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు, చేనేత పింఛన్లు.. మరెన్నో మనకు తెలుసు. ఒకప్పుడు తమిళనాడుకు మాత్రమే పరిమితమైన ఇలాంటి ప్రజాకర్షఖ పథకాలను ఇప్పుడు దక్షిణాది రాష్ర్టాలే కాకుండా ఉత్తరాది రాష్ర్టాలు కూడా అనుసరిస్తున్నాయి. కేవలం మనుషుల సంక్షేమమే కాకుండా జంతుసంక్షేమం కూడా తమ విధి అని అంటోంది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. అక్కడ ఒక్కో ఆవుకు నెలకు రూ. 500 భత్యాన్ని అందించే గోశాల సహాయ పథకం ప్రారంభమైంది. 

ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ఈ రోజు దీన్ని ప్రారంభించారు. గోశాలలను ఆర్థికంగా ఆదుకోడానికి ఉద్దేశించిన ఈ పథకం కింద.. 30 కంటే ఎక్కువ ఆవులున్నవారికి ఒక్కో ఆవుకు రూ.500 చొప్పున డబ్బులు ఇస్తారు. వాటికి గడ్డీగాదం, వైద్యం కింద ఈ డబ్బును వాడుకోవాలి. రోడ్లపైన ఒక్క వీధి ఆవు కూడా కనిపించకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని పట్టుకొచ్చారు. 18 నెలల్లోగా రాష్ట్రంలో ఒక్క వీధి ఆవు కూడా కనిపించకుండా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కో సీసా మద్యంపై గోరక్షణ పన్నుకింద రూ.1.50 వసూలు చేస్తోంది ప్రభుత్వం.