శానిటైటర్ల ఫ్యాక్టరీలో పేలుడు... భారీగా మంటలు  - MicTv.in - Telugu News
mictv telugu

శానిటైటర్ల ఫ్యాక్టరీలో పేలుడు… భారీగా మంటలు 

June 5, 2020

Himachal Pradesh Sanitizer Factory

హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ శానిటైజర్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోలన్ జిల్లా బిడ్డి ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నాలుగు ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలోశానిటైజర్ల తయారీకి కావాల్సిన ముడి సరుకు తెచ్చి ఫ్యాక్టరీలోని రెండవ అంతస్తులో భద్రపరిచారు. అనుకోకుండా ప్రమాదం సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.