హిమాచల్ ప్రదేశ్ లో లోయలో పడ్డ బస్సు - MicTv.in - Telugu News
mictv telugu

హిమాచల్ ప్రదేశ్ లో లోయలో పడ్డ బస్సు

July 20, 2017

ప్రమాదాలు ఎప్పుడు ఎలా ముంచుకొస్తాయో తెలియకుండా తయారైంది ? మొన్న ఉత్తరఖండ్ లోయలో పడ్డ బస్సు సంఘటనను మరిచిపోకముందే మళ్ళీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో ఇంకొక బస్సు లోయలో పడి దాదాపు 30 మంది వరకు చనిపోయారు ? షిమ్లా జిల్లా రాంపూర్ సమీపంలో కిన్నౌర్ వద్ద ఇవాళ ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 40 మంది వరకు ప్రయాణిస్తున్న సోలంకు చెందిన ప్రైవేటు బస్సు అది. మలుపు వద్ద స్కిడ్డై 300 మీటర్ల ఎత్తు నుండి లోయలో పడటం వల్ల అందులో వున్న ప్రయాణీకులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. డ్రైవర్, కండక్టర్ మాత్రం స్వల్ప గాయాలతో బయట పడ్డారు. అసలే వర్షాకాలం లోయల్లో ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లేదంటే ఏ ప్రమాదం ఎక్కడినుండి వస్తుందో ఊహించడం కష్టం.