Himachal Truck Drivers Happy Over Hindenburg Report On Adani
mictv telugu

Adani Case : హిండెన్‌బర్గ్‌కు థ్యాంక్స్ చెబుతున్న‘ఆదానీ’ లారీ డ్రైవర్లు..

February 24, 2023

Himachal Truck Driver Happy Over Hindenburg Report On Adani

హిండెన్‌బర్గ్ నివేదికతో లక్షల కోట్ల సంపద కోల్పోయిన ఆదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లోనే కాక చాలా చోట్ల ఒత్తిడి ఎదుర్కొంటోంది. కేరళలో ఆదానీ పోర్టు నిర్మాణంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ గ్రూప్ కంపెనీలు పెడుతున్న ఫ్యాక్టరీలపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదికతో ఆదానీకి తగిన శాస్తి జరిగిందని కొందరు సంబరాలు చేసుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ లారీ డ్రైవర్లు మరింత ఖుషీగా ఉన్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక తమ జీవితాల్లో వెలుగు ప్రసాదించింది ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.

చర్చలు, చివరికి దిగొచ్చి..

హిమాచల్‌ ప్రదేశ్‌లోని గాగల్, దార్లఘాట్ లలో ఆదానీ లకు రెండు సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నాయి. సిమెంటును సరఫరా చేస్తున్న లారీ డ్రైవర్లు ఎక్కువ కిరాయి అడుగుతున్నారని ఆదానీ గ్రూప్ వాటిని మూసేయాలనుకుంది. టన్ను సిమెంట్‌ రవాణకు కిలోమీటరకు డ్రైవర్లు రూ. 11 వసూలు చేస్తున్నారని, ఆమొత్తాన్ని రూ. 5.50కు తగ్గించాలని కోరింది. ఆ ధర తమకు గిట్టుబాటు కాదనీ డ్రైవర్లు నికారించారు. ఇరు పక్షాల మధ్య చర్చలు జరిగాయి. యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో డ్రైవర్లు నిరసన తెలిపారు. దాదాపు 7 వేల ట్రక్కులు నిలిచిపోయాయి. గత సోమవారం మళ్లీ చర్చలు జరిగాయి. ఆదానీ గ్రూప్ ఎట్టకేలకు దిగివచ్చింది. లారీ డ్రైవర్లు మొత్తానికి ఒక రూపాయి తగ్గించుకుంటామని అంగీకరించారు. హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో తమ ప్లాంట్లను మూసేస్తే పరువు మరింత పోయి అసలుకే మోసం వస్తుందని ఆదానీ గ్రూప్ దిగివచ్చిందని, అది దేవుడు పంపిన కానుక అని కార్మికులు అంటున్నారు. ఆదానీ గ్రూప్‌లోని పలు కంపెనీలు భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డాయని, లేని ఆస్తులను ఉన్నట్లు చూపి, అకౌంటింగులో మోసం చేశాయని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపించడం తెలిసిందే.