ప్లీజ్ నన్నొక్కదాన్నన్నా ఏడవకుండా పంపించు.. శివజ్యోతితో హిమజ..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్లీజ్ నన్నొక్కదాన్నన్నా ఏడవకుండా పంపించు.. శివజ్యోతితో హిమజ.. 

September 22, 2019

biggboss house

శనివారం రాహుల్ సిప్లిగంజ్ ఫేక్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. మరి ఆదివారం ఎవరిని ఎలిమినేట్ చేస్తాడా అని బిగ్‌బాస్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయి షో చూశారు. కార్యక్రమం ప్రారంభం ప్రారంభమే చాలా ఫన్నీగా సాగింది. పాటలతో ఇంటి సభ్యులతో డాన్సులు చేయించారు నాగార్జున. ఒక్కో జంటకు మూడేసి పాటలు ఇచ్చాడు. పాటల సీక్వెన్స్ మారుతుంటాయి. దీంతో వారు అప్పటికప్పుడు మారుతున్న పాటకు అనుగుణంగా డాన్స్ చేయడం అందరినీ నవ్వించింది. నాగార్జున కూడా వాళ్ల డాన్సులను చూసి చాలా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత గద్దలకొండ గణేష్ వరుణ్ తేజ్ వచ్చాడు. 

ఇంట్లో వున్న ఆడవాళ్లతో ఐలవ్ యూ చెప్పించారు. ఈ క్రమంలో అందరూ ఐలవ్ యూ చెప్పారు. వాళ్లలో శివజ్యోతి చెప్పిన ఐలవ్ యూ తనకు నచ్చిందని వరుణ్ చెప్పాడు. పునర్నవి మాత్రం వరుణ్‌కు ఐలవ్ యూ చెప్పలేకపోయింది. ఎవరికో ఐలవ్ యూ చెప్పడంతోనే తనకు ఐలవ్ యూ చెప్పలేదని వరుణ్ చమత్కరించాడు. అనంతరం వరుణే ఎలిమినేషన్ పేర్లు చదివాడు. హిమజ ఎలిమినేషన్ అయిందని ప్రకటించాడు. దీంతో హిమజ బయటకు వస్తుంటే అందరూ అదోలా ముఖాలు పెట్టారు. శివజ్యోతి ఏడవటానికి ట్రై చేసింది. ‘ప్లీజ్ ఏడవద్దు. నన్ను ఒక్కదాన్నన్నా నవ్వుతూ పంపించు’ అని హిమజ శివజ్యోతికి షాకిచ్చింది. దీంతో అందరూ హిమజను డాన్స్ చేస్తూ పంపిచారు. హిమజ కూడా కాస్త కూడా బాధపడకుండా జాలీగా ఇంట్లోంచి బయటకు వచ్చింది.