నాపై తప్పుడు వార్తలు రాయొద్దు.. కేసీఆర్ మనవడి వార్నింగ్  - MicTv.in - Telugu News
mictv telugu

నాపై తప్పుడు వార్తలు రాయొద్దు.. కేసీఆర్ మనవడి వార్నింగ్ 

October 1, 2020

Himanshu rao on his health rumors ..

తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. తన ఆరోగ్యంపై మీడియాలో వచ్చిని వార్తలను అతడు ఖండించాడు. తన కాలు కొద్దిగా బెణికిందని, అయితే దానిపై చెత్త వార్తలు రాశారని మండిపడ్డారు

హిమాన్షు రావు కాలికి తీవ్రగాయమైందని, కనీసం నిల్చోలేకపోతున్నాడని ఈ రోజు ఉదయం సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అతడు సోమాజిగూడ ఆస్పత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి.వాటిపై హిమాన్షు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘’ప్లీజ్‌.. అలాంటి సిల్లీ న్యూస్‌ పేపర్లను నమ్మొద్దు. నా కాలికి ఫ్రాక్చర్ అయినట్లు కొన్ని కొన్ని పత్రికలు పుకార్లు పుట్టించాయి. నాకేమీ కాలేదు… కండరం కొద్దిగా నలిగింది. నేను ఇప్పుడు బాగానే నడవగలుతున్నాను. రేపటి నుంచి రన్నింగ్ మొదలు పెడతాను. నా ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాసే సాహసం చేయకండి.. థ్యాంక్యూ’ అని అతడు ట్వీట్ చేశాడు.