లౌకికవాదులు మృత్యుంజయ హోమం చెయ్యాలి - MicTv.in - Telugu News
mictv telugu

లౌకికవాదులు మృత్యుంజయ హోమం చెయ్యాలి

September 11, 2017

పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్యను చాలామంది ఖండించడం కొన్ని హిందూ అతివాద సంస్థలకు మింగుడు పడటం లేదు. వారిలో కొందరు ఈ హత్యను బహిరంగంగానే సమర్థిస్తున్నారు. హిందూ మతాన్ని విమర్శించే వారు ప్రాణాలను కాపాడుకోవడానికి మృత్యుంజయ హోం చేయాలని  ఎద్దేవా కూడా చేస్తున్నారు. హిందూ ఐక్య వేదిక కేరళ అధ్యక్షురాలు కేపీ శశికళ అలియాస్ శశికళ టీచర్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె శనివారం నార్త్ పరవూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడారు..

‘కేరళలోని లౌకికవాద రచయితలందరూ కట్టగట్టుకుని మృత్యుంజయ హోమం చేసుకోండి…. గౌరి హత్య కేసులో ఆరెస్సెస్ ను కావాలని ఇరికిస్తున్నారు. నిజానికి ఆరెస్సెస్ హత్యలకు దిగితే  దేశంలో ఆ సంస్థను విమర్శించే రచయితలెవరూ భూమిపై ఉండరు.. రచయితల్లో 100 మందికి ఆరెస్సెస్ వ్యతిరేకులే.. సంఘ్ హత్యాకాండకు దిగితే ఈ రచయితల జాతి మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఈమె విద్వేష ప్రసంగంపై పోలీసులు కేసు నమోదు చేశారు. శశికళ గతంలోనూ  ముస్లింలకు, లౌకిక వాదులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె మత విద్వేషాలను రెచ్చగొడతున్నారని చాలా కేసులు నమోదయ్యాయి.