ఏపీలో బీరు సీసాలపై హిందూదేవుళ్లు.. రచ్చరచ్చ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో బీరు సీసాలపై హిందూదేవుళ్లు.. రచ్చరచ్చ

September 21, 2020

Hindu gods on beer bottles in AP .. Controversy

ఏపీలో ఇప్పటికే పలు దేవతా విగ్రహాల ధ్వంసం తీవ్ర దూమారం రేపుతుండగా.. తాజాగా బీరు సీసాలపై హిందూ దేవుళ్ల బొమ్మలను చిత్రీకరించడం కలకలం రేపింది. ఖజురహో అనే కంపెనీ తన బీరు సీసాలపై హిందూ దేవుళ్ల బొమ్మలను చిత్రీకరించినట్టుగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. తన బ్రాండ్‌కు తగ్గట్టుగా ఖజురహో బమ్మలను బీరు సీసాలపై ముద్రించడంపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ దేవుళ్లను ఆ సీసాల మీద ఎలా ముద్రిస్తారని? హిందువుల మనోభావాలు దెబ్బ తియ్యటానికే కుట్ర పూరితంగా ఈ చర్యకు పాల్పడ్డారని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో తక్షణమే ఆ బీరు సీసాలను నిషేధించి.. సదరు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అయన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతూ ట్వీట్ చేశారు. ఈ మేరకు అయన తెలంగాణ సీఎంవో, ఆంధ్రప్రదేశ్ సీఎంవోలకి తన ట్వీట్‌ని ట్యాగ్ చేశారు. ‘ఇతర మతాలకు సంబంధించి చిత్రాలను ఇలా చేయగలరా? మద్యం సీసాలపై హిందూ దేవతల బొమ్మలు ఉపయోగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇప్పటికైనా హిందూ సమాజం కళ్లు తెరవాలి’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.