పాకిస్థాన్ కేబినేట్ లో హిందువు... - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్థాన్ కేబినేట్ లో హిందువు…

August 5, 2017

దాదాపుగా 20 సంవత్సరాల తరువాత పాకిస్థాన్ క్యాబినేట్ లో ఓ హిందువు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పనామా కేసుతో సంబందం ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను పాకిస్థాన్ సుప్రీంకోర్టు రాజీనామా చేయాలని తీర్పు ఇచ్చింది. దానితో నవాజ్ షరీఫ్ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో తాత్కాలిక ప్రధానిగా శుక్రవారం షాహిద్ అబ్బాసీ ప్రమాణ స్వీకారం చేశారు.

46 మందితో తన క్యాబినెట్ ను విస్తరించారు. మంత్రి వర్గంలోనే తొలిసారిగా ఓ హిందూ వ్యక్తికి కూడా మంత్రిగా తీసుకోన్నారు. 65 యేండ్ల దర్శన్ లాల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.పార్లమెంట్ కు ఆయన ఎన్నిక కావడం ఇది రెండవసారి. పాకిస్థాన్ లోని నాలుగు రాష్ట్రాలకు దర్శన్ లాల్ కో ఆర్డినేట్ చేయనున్నారు. పీఎంఎల్- ఎన్ టికెట్ పై ఆయన 2013లో ఎన్నికయ్యారు. సింధు ప్రావిన్సు లో దర్శన్ లాల్ గోత్కీ జిల్లాలో మెడిసన్ ప్రాక్టీసు చేశారు.