Hindu Mahasabha Promises To Change UP's Meerut's Name To Nathuram Godse Nagar If It Wins Mayor Poll
mictv telugu

మేం గెలిస్తే ముస్లిం ప్రాంతాల పేర్లను మార్చేస్తాం.. హిందూ మహాసభ చీఫ్

November 23, 2022

ఉత్తర్ ప్రదేశ్ అర్భన్ బాడీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే మీరట్ నగరం పేరును ‘నాథురామ్ గాడ్సే నగర్’ మారుస్తామని ప్రకటించింది హిందూ మహాసభ. తాము గెలిస్తే ముస్లిం ప్రాంతాల పేర్లను మార్చేస్తామని ఆ రాష్ట్ర హిందూ మహాసభ చీఫ్ అభిషేక్ అగర్వాల్ అన్నారు. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని.. గోమాతను కాపాడుకుంటామని తెలిపింది. ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కూడా తాము పోటీచేస్తామని తెలిపారు. ఇదే విధంగా హిందూ మహాసభ ఓ మేనిఫెస్టోను కూడా ప్రకటించింది.

బీజేపీ, శివసేనపై తీవ్రస్థాయిలో మండిపడింది హిందూ మహాసభ. ఈ రెండు పార్టీల్లో ఇతర వర్గాల ప్రజలు చేరడంతో వారు తమ భావజాలాన్ని వదిలేస్తున్నారంటూ విమర్శించింది. హిందూ మహాసభ తగినంత మంది కౌన్సిలర్లను సంపాదించి, మేయర్ పదవి గెలిస్తే మీరట్ పేరును తప్పకుండా మారుస్తామని ప్రకటించింది. నగరంలోకి వివిధ ప్రాంతాల ఇస్లామిక్ పేర్లను మార్చి హిందూ నేతల పేర్లను పెడతామని హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు పండిట్ అశోక్ శర్మ అన్నారు. దేశభక్తి గల అభ్యర్థులను గుర్తిస్తామని.. సంస్థ ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటామని వారంతా హామీ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.