Hindu man dies by suicide after Muslim wife, brother-in-law forcefully feed him beef in Surat
mictv telugu

భార్య, బామ్మర్ది కలిసి బీఫ్ తినిపించారని వ్యక్తి ఆత్మహత్య

August 30, 2022

భార్య, బావమరిది కలిసి బలవంతంగా బీఫ్ తినిపించారని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్ రాష్ట్రం సూరత్లోని ఉఢానాలో 27న ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు కారణమైన నిందితులిద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడిని రోహిత్ సింగ్గా గుర్తించారు. టెక్స్టైల్ మిల్లులో పనిచేసే రోహిత్ సింగ్‌కు అక్కడే పనిచేస్తున్న సోనమ్ అనే యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. రోహిత్ కుటుంబ సభ్యులు వీరిని ఇంటికి రానివ్వకపోవడం వల్ల రోహిత్, సోనమ్ వేరే కాపురం పెట్టారు.

ఈ క్రమంలో భార్య సోనమ్, బావమరిది అక్తర్ ఓ రోజు బలవంతంగా బీఫ్ తినిపించారు. అది తట్టుకోలేక తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయాన్ని సూసైడ్ నోట్ లో రాసి ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశాడు. ఈ సూసైడ్ నోట్ పోస్ట్‌ను రోహిత్ స్నేహితుడు చూడడం వల్ల దారుణం బయటపడింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నిందితులిద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.