మానవత్వం.. హిందూ శ్మశానవాటికలో ముస్లిం ఖననం..
హిందూ ముస్లింల మధ్య మత సామరస్యం మరోసారి బయటపడింది. కరోనా భయంతో అంత్యక్రియలకు ముస్లిం మత పెద్దలు అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా వాటన్నింటని పక్కన పెట్టి ఆ ముస్లిం వ్యక్తిని హిందూ శ్మశానవాటికలో ఖననం చేసేందుకు అంగీకరించారు. ఎలాంటి విభేదాలు లేకుండా తమలోని మానవత్వాన్ని బయటపెట్టుకున్నారు.
ఖాజా మియా (55) అనే వ్యక్తి ఇటీవల గుండె పోటుతో చనిపోయాడు. లాక్‌డౌన్ కారణంగా అతన్ని హైదరాబాద్‌లోనే ఖననం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ముత్వాలీలు దీనికి అనుమతి ఇవ్వలేదు. ఆరు శ్మశాన వాటికలకు వద్దకు వెళ్లినా ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో సందీప్, శేఖర్ అనే ఇద్దరు యువకుల చొరవతో హిందూ శ్మశాన వాటికలో ఖాజా మియా భౌతిక కాయాన్ని పూడ్చి పెట్టారు. శాస్రబద్ధంగా కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ విషయం మత పెద్దలకు తెలియడంతో ఖననానికి నిరాకరించిన వారిపై సీరియస్ అయ్యారు. చనిపోయిన వారి పట్ల అమానవీయంగా వ్యవహరించొద్దని సూచించారు. కాగా ఇప్పటికే కరోనా రోగుల మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు బాలాపూర్ సమీపంలో ప్రత్యేకంగా ఓ శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేశారు.