హిందూ-ముస్లిం ఐక్యతకు అద్దం.. ఈ జవాన్లకు ఓ లైక్ వేస్కోండి! - MicTv.in - Telugu News
mictv telugu

హిందూ-ముస్లిం ఐక్యతకు అద్దం.. ఈ జవాన్లకు ఓ లైక్ వేస్కోండి!

August 12, 2020

Hindu Muslim soldires on praying under on roon indian army .

భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నం భారత్. వందల మతాలు, వేల భాషలు ఉన్నా ఏకసూత్రత అందర్నీ ఏకతాటిపై నడిపిస్తోంది. కొన్ని అవాంఛనీయ సంఘటనలు, మతరాజకీయాలు వికృతంగా కాటేస్తున్నా సాధారణ పౌరులు మాత్రం సామరస్యంతోనే ముందుకు సాగిపోతున్నారు. హిందూ, ముస్లిం భాయీ భాయీ అంటున్నారు. దీనికి ఐక్యతకు అద్దం పట్టే దృశ్యం ఆర్మీలో కనిపించింది. 

దేశఃరక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న ఓ హిందూ సైనికుడు, ఓ ముస్లిం సైనికుడు ఓకే చోట ప్రార్థనలు చేసుకుంటున్న దృశ్యమిది. ఇన్‌స్టాగ్రాంలో ఆర్మీకి చెందిన వ్యక్తి దీన్ని పోస్ట్ చేశారు. ‘సర్వ ధర్మస్థలం అనే కప్పుకింది మందిరంలో పూజ, మసీదులో నమాజ్.. మేం బయటకి చెప్పకూడని చోట ఉన్నా ఈ ఇద్దరు యువకులు ఓకే కప్పు కింద ఓ గోడకు అ ఇటూ ప్రార్థన చేసుకుంటున్న ఈ అద్భుత దృశ్యాన్ని పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాను..’ అని పేర్కొన్నారు. ఆర్మీలో మతసామరస్యానికి ఈ చిత్రం అద్దం పడుతోందని, దేశప్రజలందరూ దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.