మరో మసీదు కింద హిందూ ఆలయం.. - MicTv.in - Telugu News
mictv telugu

మరో మసీదు కింద హిందూ ఆలయం..

May 23, 2022

కాశీలోని జ్ఞానవాపి మసీదులో ఓ బావిలో శివలింగం దొరికిందన్న వార్తలు కలకలం రేపుతున్న నేపథ్యంలో మరో మసీదు కింద హిందూ ఆలయం వంటి నిర్మాణం బయటపడింది. మంగళూరు నగర శివార్లలోని మలాలీ మార్కెట్ మసీదు ఆధునికీకరణ పనులు చేపడుతుండగా, ఆలయం వంటి నిర్మాణాన్ని గుర్తించారు. ఈ స్థలంలో మసీదు నిర్మించడానికి పూర్వం ఓ ఆలయం ఉండేదని స్థానిక సంఘాలు అంటున్నాయి.

ఈ మసీదు ప్రదేశానికి సంబంధించిన దస్తావేజులను పరిశీలించే వరకు ఆధునికీకరణ పనులను నిలిపేయాలని అధికారులను విశ్వహిందూ పరిషత్ నేతలు కోరారు. తదుపరి ఆదేశాలను జారీ చేసే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని దక్షిణ కన్నడ కమిషనరేట్ ఆదేశించింది. భూమి రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. రికార్డుల తనిఖీ పూర్తయ్యే వరకు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు చేపట్టాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వర్గాలు భావిస్తుండగా.. ఈ ఆలయం వంటి నిర్మాణం జైనుల మఠానికి సంబంధించినది కావొచ్చని మరో వాదన వినిపిస్తోంది.