పాకిస్తాన్‌లో హిందూ యువతి కాల్చివేత - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌లో హిందూ యువతి కాల్చివేత

March 22, 2022

pakistanu

పాకిస్తాన్‌లో మైనార్టీల పరిస్థితి రోజురోజుకూ ఘోరంగా మారిపోతోంది. వారి కుమార్తెలను కిడ్నాప్ చేయడం, బలవంతంగా పెళ్లి చేసుకొని మతం మార్పించడం, మాట వినకుంటే బెదిరించడం, మొండికేస్తే చంపేయడం లాంటి ఘటనలు నిత్యక‌ృత్యాలయ్యాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఆ దేశంలోని సింధ్ రాష్ట్రంలోని రోహి పట్టణం సుక్కూర్‌లో జరిగింది. హిందూ మతానికి చెందిన 18 ఏళ్ల పూజా అనే అమ్మాయిని కొందరు దుండగులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. కానీ, పూజ తీవ్రంగా ప్రతిఘటించడంతో దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. దాంతో తీవ్ర గాయాలపాలైన పూజను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఇలాంటి వాటిని అరికట్టడంతో ఘోరంగా విఫలమైందని విమర్శిస్తున్నారు. కాగా, పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు హిందూ జనాభా 23 శాతం ఉండేది. బలవంతపు మత మార్పిళ్లు, హింస, హత్యలు వంటి వాటి వల్ల ఇప్పుడు 1.60 శాతానికి దిగజారారు.