మీసం మెలేసిన నాలుగో సింహం గెలిచింది! - MicTv.in - Telugu News
mictv telugu

మీసం మెలేసిన నాలుగో సింహం గెలిచింది!

May 23, 2019

సీఐ గోరంట్ల మాధవ్..సార్వత్రిక ఎన్నికల ముందు మీడియాలో మారుమోగింది పేరిది. ఒక కేసు విషయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మాధవ్‌కు మధ్య పెద్ద వివాదమే జరిగింది. దివాకర్ రెడ్డి పోలీసులను దూషించడంతో గోరంట్ల మాధవ్ దివాకర్ రెడ్డిపై విరుచుకుపడ్డాడు. మాధవ్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి దివాకర్ రెడ్డిపై మీసం మెలేసాడు.

తరువాత కొన్ని రోజులకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరి హిందూపురం ఎంపీ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పతో పోటీ పడ్డారు. హోరాహోరీగా సాగిన పోటీలో మాధవ్ లక్షపై చిలుకు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో ఆయన విజయం లాంఛనమే అయింది. మాధవ్‌కు నాలుగు లక్షల పైగా ఓట్లు పోలయ్యాయి.