కుటుంబ సమేతంగా బాలయ్య కోటి దీపోత్సవం - MicTv.in - Telugu News
mictv telugu

కుటుంబ సమేతంగా బాలయ్య కోటి దీపోత్సవం

November 26, 2019

Hindupur mla balakrishna conducted koti deepotsavam.

టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ సామూహిక కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. నిన్న ఆఖరి కార్తీక సోమవారం పురస్కరించుకుని స్వంత నియోజకవర్గం హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో సందడి చేశారు. బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధర, అల్లుళ్ళు లోకేశ్‌, భరత్‌ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. 

ఈ కోటి దీపోత్సవానికి హిందూపురం పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ..‘తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వీటిని ఎవరూ మరువవద్దు, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అని అన్నారు. దీనికి సంబందించిన ఫోటోలను బాలకృష్ణ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.