హిందూపురాన్ని జిల్లా చేయండి..బాలకృష్ణ - MicTv.in - Telugu News
mictv telugu

హిందూపురాన్ని జిల్లా చేయండి..బాలకృష్ణ

July 14, 2020

cngcv

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రెండు లేఖలు రాశారు. రాష్ట్రంలో చేపట్టనున్న జిల్లాల పునర్విభజనలో హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని లేఖలో ఆయన పేర్కొన్నారు. 

ప్రస్తుత జిల్లా కేంద్రమైన అనంతపురం హిందూపురానికి 110 కిలో మీటర్ల దూరంలో ఉందని గుర్తు చేశారు. ఈమేర సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి లేఖ రాశారు. అలాగే హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మంజూరైన మెడికల్ కాలేజీని హిందూపూర్ సమీపంలో మలుగూరు వద్ద ఏర్పాటు చేయాలంటూ మరో లేఖలో పేర్కొన్నారు. దీని కోసం సరిపడ భూమి అందుబాటులో ఉందని లేఖలో ప్రస్తావించారు. మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు రాయలసీమ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లేఖలో బాలకృష్ణ పేర్కొన్నారు.