రేపిస్టుల జాబితాలో ఎంపీ గోరంట్ల మాధవ్.. - MicTv.in - Telugu News
mictv telugu

రేపిస్టుల జాబితాలో ఎంపీ గోరంట్ల మాధవ్..

December 7, 2019

Hindupur  Ysr congress mp gorantla madhav.

దిశ హత్యాచార కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం చర్చకు దారితీసింది. మిగతా దోషులను కూడా ఎందుకు అలా శిక్షించడం లేదని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్.. సహా అన్ని పార్టీల్లోనూ అత్యాచారాలు, అత్యాచార యత్నాలు చేసిన వారు ఉన్నారని, వారిని ప్రభుత్వాలు కాపాడుతూ పేదలన మాత్రమే చంపుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో రేప్ కేసులు ఎదుర్కొంటున్న నేతల పేర్లు బయటికి వస్తున్నాయి. రెబల్ పోలీస్‌గా పేరొంది, వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచిన హిందూపురం ఎంపీ కురవ గోరంట్ల మాధవ్‌పైనా అత్యాచార కేసు ఉన్నట్లు తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్లో అతడు స్వయంగా పేర్కొన్నారు. రేప్ కేసుతోపాటు మర్డర్, క్రిమినల్ బెదిరింపు కేసులు కూడా అతనిపై ఉన్నాయి. జాతీయ మీడియా ఆయన పేరును బయటికి తీసింది. మాధవ్ పోలీసు అధికారిగా పనిచేసినప్పుడు అత్యాచార యత్నానికి తెగబడ్డారని వార్తలు వస్తున్నాయి. ప్రేమజంటను అదుపులోకి తీసుకున్న ఆయన యువతిపై అత్యాచారానికి యత్నించినట్లు కథనాలు వస్తున్నాయి. మాధవ్ తోపాటు బీజేపీకి చెందిన సౌమిత్రా ఖాన్(పశ్చిమ బెంగాల్), కాంగ్రెస్ కు చెందిన హిబీ ఈడెన్(కేరళ) కూడా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.