డీఎస్పీ కాదు, నేనే సెల్యూట్‌ చేశా : గోరంట్ల మాధవ్‌ - MicTv.in - Telugu News
mictv telugu

డీఎస్పీ కాదు, నేనే సెల్యూట్‌ చేశా : గోరంట్ల మాధవ్‌

May 25, 2019

గోరంట్ల మాధవ్.. పోలీస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి హిందూపురం లోక్‌సభ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. టీడీపీ సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నేత నిమ్మల కిష్టప్పపై అత్యధిక మెజార్టీతో గెలుపొందిన మాధవ్‌కు డీఎస్పీ సహా కొందరు పోలీస్ ఉన్నతాధికారులు సెల్యూట్ చేశారని ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ప్రచారంపై స్పందించిన మాధవ్ అదంతా అబద్ధమని, తానే అధికారులకు సెల్యూట్ చేశానని స్పష్టం చేశారు. శనివారం వైసీపీ పార్లమెంటరీ సమావేశ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Hindupur Ysr congress Party mp Gorantla madhav Respond about Senior police officer salute

‘ఎంతో నమ్మకంతో ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు ఎంపీలంతా ఏకాతాటిపై ఉండి పోరాడాలని అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. నియోజవర్గాల్లో ప్రజా సమస్యలు తెలుసుకోవాలని వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఎంపీలందరం ఏపీ ప్రత్యేక హోదానే ఎజెండాగా ముందుకు వెళ్తూ.. రాష్ట్రానికి ప్రత్యేక హదా సాధిస్తాం. బాపట్ల ఎంపీ నందిగాం సురేశ్‌..  సార్‌ నేనిక్కడ కూలీకి వెళ్లాను. అలాంటి నన్ను ఎంపీనీ చేశారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. నాకు కూడా కన్నీళ్లు ఆగలేదు. నేను పోలీస్ స్టేషన్ నుంచి పార్లమెంట్ కు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది’ అని గోరంట్ల మాధవ్‌ పేర్కొన్నారు.