వన్యమృగాలను చూడటానికే భయపడుతుంటారు మామూలు జనాలు. అలాంటిది కళ్లెదురుగా ఒకేసారి ప్రత్యక్షమై.. అమాంతం మింగిస్తే.. వామ్మె.. వింటుంటూనే ఒళ్లు గగుర్పాటుకు గురవ్వడంతోపాటు భయం కలగకమానదు. అలాంటి సంఘటన ఒకటి ఓ రెండేళ్ల బాలుడి విషయంలో జరిగింది. అయితే ఆ చిన్నారికి భూమ్మీద ఇంకా నూకలున్నాయేమో. వన్యమృగం బారి నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ భయానక సంఘటన ఉగాండాలో చోటు చేసుకుంది. సరస్సు పక్కన ఓ చిన్నారి బయట ఆడుకుంటుండగా.. ఉన్నట్లుండి హిప్పో అందులో నుంచి బయటకు వచ్చింది. వెంటనే బాలుడిని మింగేసింది. అది మింగుతుండగా అటుగా వెళుతున్న వ్యక్తి కంటపడటంతో అతడు జంతువుపైకి రాళ్లు విసిరాడు. దీంతో భయపడిన హిప్పో బాలుడిని బయటకు విసిరింది.
దీంతో .. మళ్లీ మృత్యుంజయుడిగా పిల్లాడు తిరిగి బయటకు వచ్చాడు. పాల్ ఇగా అనే పసివాడిని హిప్పొ మింగిన తర్వాత.. తిరిగి ఉమ్మివేసింది. దీంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కట్వే కబటోరోలోని ఎడ్వర్డ్ సరస్సు ఒడ్డుకు 800 గజాల దూరంలో 2 ఏళ్ల పాల్ ఆడుకుంటున్నాడు. ఆకాస్మత్తుగా వచ్చిన భారీ హిప్పో దాని దవడలతో పిల్లాడిని పట్టుకుంది. అది మింగేసే సమయంలో స్థానికులు దాన్ని రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. అయితే లక్కీగా బాలుడిని తన నోట్లో నుంచి ఉమ్మేయడంతో ప్రమాదం తప్పింది.ఇలా ఓ హిప్పో పిల్లాడిపై దాడి చేయడం ఇదే మొదటి సంఘటన అని అక్కడి పోలీస్ అధికారి వెల్లడించారు. హిప్పోను రాళ్లతో కొట్టడం ప్రారంభించిన క్రిస్పాస్ బాగోంజా అనే వ్యక్తి దైర్య సహాసాలను అంతా ప్రశంసిస్తున్నారు. హిప్పో దాడిలో పాల్ కు స్వల్పగాయాలు అయ్యాయి. పిల్లాడికి రేబిస్ వ్యాక్సిన్ వేసిన వైద్యులు ఆ తరువాత డిశ్చార్జ్ చేశారు.