Historical moment in Kashmir.. Theaters open for 30 years
mictv telugu

కశ్మీర్‌‌లో 30 ఏళ్లకి తెరుచుకున్న థియేటర్లు..

September 19, 2022

జమ్మూకశ్మీర్‌లో దాదాపు 30 ఏళ్ల తర్వాత సినిమా హాల్స్ ప్రారంభమైయ్యాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, శోషియాలలో ఆదివారం మల్టీపర్పస్ సినిమా హాళ్లను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..” వినేవారికి, చూసేవారికి ఈ విషయం చిన్నది కావొచ్చు. కానీ, జమ్మూకాశ్మీర్‌ చరిత్రలో ఇదొక చరిత్రాత్మక ఘట్టం. భవిష్యత్‌లో జమ్ములోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్‌ను నెలకొల్పుతాం. ప్రస్తుతం ప్రారంభించిన ఈ సినిమా హాళ్లను పుల్వామా, శోఫియా యువతకు అంకితం చేస్తున్నాం. త్వరలోనే అనంత్ నాగ్, శ్రీనగర్, బందిపోరా, గందర్బల్, దోడా, రాజౌరి, ఫూంచ్, కిష్వార్, రియాసీలలో థియేటర్లను అందుబాటులోకి తీసుకురానున్నాం” అని ఆయన అన్నారు.

అంతేకాదు, సినిమాల ప్రదర్శనతోపాటు ఇన్ఫోటెయిన్మెంట్, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఇక్కడ ఏర్పాట్లు చేశామని, వీటితోపాటు వచ్చేవారం కశ్మీర్‌లో తొలి ఐనాక్స్ మల్టీ ప్లెక్స్ ప్రారంభం కానుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సినిమా హాల్స్‌లోకి ప్రవేశించి, అందులో ఏర్పాటు చేసిన సీట్లను, స్క్రీన్లను ఆయన పరిశీలించారు. కొద్దిసేపు ఆ సీట్లలో కుర్చోని, థియేటర్స్ అందాలను వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

”శ్రీనగర్‌లోని సోమ్‌వార్ ప్రాంతంలో దీన్ని తెరవనున్నారు. 520 సీట్ల సామర్థ్యం కలిగిన మూడు స్క్రీన్లు ఇందులో ఉండనున్నాయి. ఉగ్రవాద చర్యలతో 1980 వరకు కశ్మీర్ లోయలో దాదాపు డజను థియేటర్లు నడిచేవి. ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడంతో క్రమక్రమంగా యజమానులు వాటిని మూసివేస్తూ వచ్చారు. 1990 దశకం ప్రారంభంలో సినిమా హాళ్లన్నింటినీ మూసేశారు. వీటిని తిరిగి తెరిచేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. అయితే, 1999లో శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ఉన్న రీగల్ సినిమాహాల్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేయడం ద్వారా ఆ ప్రయత్నాలకు విఘాతం కల్పించారు. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్లకి జమ్ముకాశ్మీర్‌లో థియేటర్లు తిరిగి ప్రారంభం అయ్యాయి”.