పద్మావతి ఫస్ట్ సాంగ్ కేక.. - MicTv.in - Telugu News
mictv telugu

పద్మావతి ఫస్ట్ సాంగ్ కేక..

October 25, 2017

భారీ తారాగణంతో, బడ్జెట్ తో రూపొందిన బాలీవుడ్  చారిత్రక చిత్రం  ‘పద్మావతి’ చూసేవాళ్ల కళ్లను చెదరగొడుతోంది. ఈ మూవీ తొలి వీడియో పాట బుధవారం విడుదలైంది. దీపికా పడుకుణే.. రాణి పద్మావతి పాత్రలో రాజపుత్ర భవనాల మధ్య డోలా డోలా అంటూ చేస్తున్న డ్యాన్స్ వీక్షకులను కట్టిపడేస్తోంది.  

శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటను పూర్తిగా చిత్తోర్ గఢ్ కోటలో చిత్రీకరించారు. చీకటి వెలుగుల మధ్య అంత:పుర కాంతలు, పుర ప్రజలు చూస్తుండగా రాణి నృత్యం చేస్తోంది. సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పద్మావతి ఫస్ట్ లుక్స్, టీజర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి.