మూడు లాంతర్ల స్తంభం కూల్చివేతపై వివాదం  - MicTv.in - Telugu News
mictv telugu

మూడు లాంతర్ల స్తంభం కూల్చివేతపై వివాదం 

May 23, 2020

Historical Status Protest in Vizianagaram

చారిత్రక చిహ్నాల కూల్చివేత విజయనగరం జిల్లాలో రగడను సృష్టించాయి. వందల ఏళ్ల క్రితం నగర చౌరస్తాలో నిర్మించిన వీటిని తొలగిండాన్ని  మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు  తప్పుబట్టారు. నగర వైభవానికి చిహ్నంగా ఉన్న వాటిని తొలగించడం ఏంటన్ని ప్రశ్నించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్వాతంత్ర సమరయోధులు, అధికారిక చిహ్నాలకు ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాజ్యంగ బద్ధ పదవుల్లో ఉన్న నాయకులు ఇలా ప్రవర్తించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నగరవాసులు స్పందించాలని కోరారు. 

విజయనగరం చారిత్రక చిహ్నాలుగా చౌరస్తాలో కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేశారు. వాటిలో మూడు లాంతర్లు, గంట స్తంభం ఏర్పాటు చేశారు. తాజాగా వాటిని తొలగించడంతో వివాదం మొదలైంది. చారిత్రక ఆనావాళ్లను ఇలా తీసివేయడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. కాగా ఈ జంక్షన్‌ వద్ద హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు హరికథలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. వెంటనే కూల్చివేసిన చిహ్నాలను పునరుద్ధరించాలని అశోక గజపతి రాజు డిమాండ్ చేశారు.