మహాకోడలు.. సొంత మామను కారుతో గుద్ది..   - MicTv.in - Telugu News
mictv telugu

మహాకోడలు.. సొంత మామను కారుతో గుద్ది..  

September 21, 2020

Hit-and-run driver on her mobile ploughs into man on zebra crossing only to find out later it was her father-in-law

కొన్ని సంఘటనలు ఊహించని విధంగా జరుగుతుంటాయి. కేవలం యాదృచ్ఛికం అని సరిపెట్టకోక తప్పందు. మాంచి జోరులో కారు నడుపుతున్న మహిళ.. జీబ్రా క్రాస్ వద్ద రోడ్డుదాటుతున్న వృద్ధున్ని ఢీకొట్టి పారిపోయింది. ‘ఎవడో దారిపోతున్న దానయ్యలే. బతికాడో, చచ్చాడో నాకెందుకు. పోలీసులకు దొరికినప్పుడు చూసుకుందాం.. ‘ అనుకుంది. ఆధారాలు దొరక్కుండా విండ్ స్క్రీన్ మార్చేసింది. కానీ చేసిన పాపం వెంటాడింది. సీసీకెమెరాలు ఆమె బండారం బయటపెట్టాయి. తర్వాత  అమ్మడికి అసలు విషయం తెలిసి దిమ్మతిరిగింది. తాను గుద్దింది స్వయంగా తన భర్త తండ్రిని అని తెసుకుని నాలిక్కరుచుకుంది. పోలీసులు అమ్మడికి బేడీలు వేసి జైల్లోకి నెట్టేశారు. 

ఇంగ్లాండులోని లీసెష్టర్‌లో 2018 ఫిబ్రవరిలో జరిగిందీ ప్రమాదం. ఫతేహా బేగం బెదిన్ అనే 29 ఏళ్ల మహిళ కన్నుమిన్నూ కానకుండా ముసలాయణ్ని గుద్దేసి పారిపోయింది. మొదట కేసుతో తనకు సంబంధం లేదని బొంకింది. తర్వాత.. ‘ఏమో, నేనే చేశానామో. సరిగ్గా గుర్తులేదు. నాకు ఆరోగ్యం బాగాలేదు. ఏం జరిగిందో ఏమిటో మరిచిపోయాను’ అని మహానటి అవతారం ఎత్తింది. విండ్ స్క్రీన్ ఎందుకు మార్చావంటే.. దొంగల పగలగొట్టి పోయారు కాబట్టి రీప్లేస్ చేశా అంటూ అబద్ధాలపై అబద్ధాలు చెప్పుకుంటూ పోయింది. పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి గట్టి ఆధారాలు సేకరించారు. కోర్టు ఆమెకు 18 నెలల జైలు శిక్ష విధించింది. రెండేళ్లపాటు స్టీరింగ్ ముట్టుకోవద్దని నిషేధం పెట్టింది. కోడలి దాడిలో గాయపడిన మామ తీవ్ర గాయాల నుంచి కోలుకున్నాడు.