చెప్పులతో కొట్టుకున్న తమిళ రైతులు..! కనికరం చూపని పాలకుడు..! - MicTv.in - Telugu News
mictv telugu

చెప్పులతో కొట్టుకున్న తమిళ రైతులు..! కనికరం చూపని పాలకుడు..!

July 21, 2017

మూత్రం తాగారు అయినా పాలకుల మన్సులు కరగలేదు,నగ్నంగా నిరసన తెలిపారు..చావగొట్టి  తరిమికొట్టారు,ఇంకా ఎన్నో రకాలుగా నిరసనలు ప్రకటించారు, అయినా ప్రభుత్వాలు నా సీటుకు జెప్పు అన్నట్టే ప్రవర్తిస్తున్నాయి,ఇది తమిళనాడు  రైతుల పరిస్ధితి. జై కిసాన్ అంటూ ఊకదంపుడు ఊదే  ఈదేశంలో రైతుకి ఏంటి ఈ దుస్థితి,రుణ మాఫీల కోసమనీ రైతులు ఇంకా ఎన్ని వేశాలు వేయాలి? ఎన్ని నిరసనలు తెలపాలి ?వాళ్ల దగ్గర ఉన్న అన్ని నిరసన రూపాలు అయిపోయాయి.అందుకే తమిళ రైతులకు ఈ వ్యవస్థమీదే బాగా కోపం వచ్చింది. సమాజాన్ని ఏమీ చేయలేక పోతున్నామని, తమ నిస్సహాయతపై వారికే ఆగ్రహం కట్టలు తెంచుకుంది.తమ చెప్పులతో తామే కొట్టుకుని నిరసన తెలియజేశారు.

అవును కొట్టుకోవాల్సిందే.. చెప్పులులేకుండా పొలంలోకి దిగి నాట్లువేసి..తమ కాళ్లు బురదలో కూరుకుపోయినా పర్వాలేదు అని అందరి ఆకలి తీర్చడానికి పాటు పడే రైతు తనచెప్పుతో తాను కొట్టుకోవాల్సిందే,దళారీగాళ్ల దౌర్జన్యాలను ఎదిరించలేక.. నిస్సహాయతతో ఆకలి చావులు చస్తున్న  రైతులు..చెప్పులతో కొట్టుకోవాల్సిందే,వేలకోట్లు ముంచిపోయినోళ్లను ఏమీ పీకలేకపోయినా..వేల రూపాల రుణాలను కట్టని రైతులమీద హీరోయిజం చూపించే బ్యాంకు ఆఫీసర్లున్న గొప్ప సమాజంలో బతుకుతున్నందుకు రైతులు చెప్పులతో తమని తాము కొట్టుకోవాల్సిందే…ఇన్ని రోజులుగా దేశానికి అన్నం పెడుతున్న రైతుకు ఈ గతి పట్టాల్సిందే,అయితే కొట్టుకోవడం కాకుండా అదే చెప్పుతో  ఓట్లకోసం వచ్చినప్పుడు సమాధానం చెబితే సరిపోతుందని తమిళరైతులు ఆలోచిస్తే బాగుంటుంది.