టాలీవుడ్లో గతకొన్ని రోజులుగా నటుడు విశ్వక్సేన్ గురించి తెగ చర్చ నడుస్తోంది. విశ్వక్సేన్ ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అతనికి ఎందుకంత పొగరు? అనే విషయాలపై ఇటు సోషల్ మీడియాలో అటు టాలీవుడ్లో తెగ చర్చించుకుంటున్నారు. పలు అనుమానాలకు స్పష్టతనిస్తూ, విశ్వక్సేన్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
”అవును నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంత పెద్ద ఇండస్ట్రీలో నలుగురు కలిసి కొడితే పడిపోతానేమో కానీ, ఆ నలుగురు నన్ను కొట్టాలి అంటే నాకు పెద్ద షెల్ ఉంది. అది మీరే. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో నాకు సపోర్ట్ చేస్తున్న జనాలను చూస్తుంటే, ఇది రా నా ఆస్తి అని నాకు అనిపించింది. ఎందుకు రా నీకూ ఇంత పొగరు అంటే.. హ్యాష్ ట్యాగ్ విశ్వక్సేన్ కొట్టి చూడండి, చెప్తా. మీ అందరికీ థాంక్స్” అంటూ తన అభిమానులతో ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ ఆడియో ఫంక్షన్లో విశ్వక్సేన్ వ్యాఖ్యలు చేశాడు.
‘నేను నిజంగా చెప్తున్నా, నా ప్లేస్లో వీక్ హార్టెడ్ పర్సన్ ఉంటే ఏమైనా చేసుకోవచ్చు. కానీ నాకు ఆ ధైర్యం ఇచ్చింది మీరే. నేను చెప్పుకునేది ఒకటే రా.. ఐ లవ్ యూ గయ్స్, నాకు మీరు తప్ప ఈ ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు’ అంటూ విశ్వక్సేన్ మోకాళ్ళ మీదపడి ఎమోషనల్ అయ్యాడు.