తిరుగుబోతులకు హెచ్చరిక.. ఆమెకు ఎయిడ్స్ ఉంది.. అతనికి అంటించింది.. - MicTv.in - Telugu News
mictv telugu

తిరుగుబోతులకు హెచ్చరిక.. ఆమెకు ఎయిడ్స్ ఉంది.. అతనికి అంటించింది..

March 29, 2018

అలాంటి ఆవేశాలే అంత. ఎంత ప్రేమ ఉన్నా అదంతా అవసరం తీరేంతవరకే. పాపం అతనికి ఈ విషయం తెలియదు. ఆమెను నమ్మాడు. ఆమె కూడా అతన్ని నమ్మినట్లు నటించింది. కానీ ఆమెలో మరొకడిపై ఉన్న కసి.. అతనితో నిజం చెప్పడానికి అడ్డొచ్చొంది. అంతే మరొక జీవితం మరణపు అంచులకు చేరుకుంది. విషయం అర్థమై ఉంటుందీపాటికి. నైజీరియన్ల యదార్థ గాథ ఇది. పరిచయం నుంచి స్నేహానికి, స్నేహం నుంచి శృంగారానికి, అట్నుంచి అంపశయ్యకు చేరుకున్న హృదయవిదారక కథ. ఆ ఇద్దరి వాట్సాప్ మెసేజీలతో లోకమంతా తెలిసిపోయి వ్యథ.

 

నైజీరియాలోన రివర్స్ రాష్ట్రం పోర్ట్ హార్కోర్ట్‌కు చెందిన గ్లోరియా అనే యువతికి ఒక వ్యక్తిద్వారా హెచ్‌ఐవీ సోకింది. తర్వాత ఆమె మరొక వ్యక్తితో సంబంధం కొనసాగించింది. అయితే అరక్షిత శృంగారంలో పాల్గొనడంతో అతనికీ ఆ ప్రాణాంతక వ్యాధి సోకింది. మొదట్లో ఏదో జ్వరం అనుకున్నాడు. కానీ ఒంట్లో శక్తి రోజురోజుకూ సన్నగిల్లడంతో ఆస్పత్రికెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అసలు విషయం తెలిసింది. గ్లోరియాపై అనుమానం వచ్చింది. ఆమెకు ఫోన్ చేశాడు. సంగతికి చెప్పాడు. అంతే. ఆమె అతణ్ని కాల్స్ లిఫ్ట్ చేయడం మానేసింది. ఫేస్ బుక్‌లో అతణ్ని బ్లాక్ చేసి పడేసింది. కానీ అతడు పట్టువదలని విక్రమార్కుడిలా వాట్సాప్‌లో ఆమెకు మెసేజీలు పెట్టాడు.

హృదయం లేని ప్రియురాలా..

‘గ్లోరియా ఎందుకిలా చేశావు? ఎందుకు ఫోనెత్తడం లేదు? నీచురాలా.. దుర్మార్గులారా.. నా బతుకును నాశనం చేశావు. కదే. నీ బండారం బయటపెడతా… ’ అని గోలపెట్టాడు. ఆమె కూడా తక్కువ తినలేదు.. ‘ఏం చేసుకుంటావో చేసుకో. నా టైం వేస్ట్ చేయకు. మీ మగాళ్లే అంత, ఆడవాళ్లను వాడుకుని వదిలేస్తారు. ఈ ప్రపంచమే నన్ను హృదయం లేనిదానిగా మార్చింది. ఒకడు నాకు ఈ జబ్బు అంటించాడు. తనకు రోగముందని నాకు చెప్పలేదు. ఇప్పుడు నేను ఆ రోగంతో పోరాడుతున్నా.. నన్ను నీచురాలని అని అనకు.. ’ అని బదులిచ్చింది. ఈ చాటింగ్ వివరాలను ఓ వ్యక్తి ఫేస్ బుక్‌లో పెట్టడంతో వైరల్ అవుతున్నాయి.