అసలే ఎయిడ్స్, ఆపై సెక్స్ పిచ్చి, మోసం.. ఆరేళ్ల జైలు  - MicTv.in - Telugu News
mictv telugu

అసలే ఎయిడ్స్, ఆపై సెక్స్ పిచ్చి, మోసం.. ఆరేళ్ల జైలు 

October 13, 2020

HIV-positive Nashville softball player, 41, is jailed for six years for having .jp

ప్రాణాంతక జబ్బులు ఉన్నవారు తోటి సమాజం పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఉత్త పుణ్యానికి ఇతరులకి జబ్బు అంటించినవారు అవుతారు. కాబట్టి అలాంటివారు ఎవ్వర్నీ కలవకుండా ఉండటం ఎంతో ఉత్తమం. వారు సమాజానికి చేసే గొప్ప మేలు అదే అవుతుంది. కానీ కొందరు తాచెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్టు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఈమధ్య తమకున్న కరోనాను ఇతరులకు అంటించిన ఘటనల గురించి తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి తనకున్న ఎయిడ్స్‌ను కామపిచ్చితో మహిళలకు అంటించాడు. తనకు ఎయిడ్స్ ఉందన్న విషయాన్ని దాచి.. తనలో రగులుతున్న కోరికలను అణుచుకోలేకపోయాడు. పలువురు మహిళలతో తన కామదాహాన్ని తీర్చుకున్నాడు. ఫలితంగా తనతో సెక్సులో పాల్గొన్న మహిళలు ఎయిడ్స్ బారిన పడ్డారు. మహిళలకు అసలు విషయం చెప్పకుండా దాచినందుకు గానూ కోర్టు అతనికి ఆరేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు యూఎస్‌లోని డేవిడ్సన్ కౌంటీ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి స్టీవ్ డోజియర్ ఆయనకు శిక్ష ఖరారు చేశారు.

అమెరికాలోని నాష్వెల్లీకి చెందిన 41 ఏళ్ల డాని పెర్రీ సాఫ్ట్ బాల్ క్రీడాకారుడు. చాలా రోజుల క్రితం అతనికి ఎయిడ్స్ నిర్ధారణ అయింది. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టాడు. తనకున్న సెక్స్ పిచ్చితో ఆ రోగాన్ని ఇతరులు నుంచి అంటించుకున్న డానీ.. అదే పిచ్చితో ఆ రోగాన్ని ఇతరులకు అంటించడానికి పూనుకున్నాడు. సుమారు 20 మంది మహిళలతో కండోమ్ వాడకుండానే సెక్స్‌లో పాల్గొన్నాడు. అతనితో శారీరకంగా కలిసినవారిలో క్రీడాకారులే కాకుండా హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అతనికి ఎయిడ్స్ ఉందని గ్రహించిన ఓ బాధితురాలు అతని మీద కేసు పెట్టింది. 2009 లోనే అతడికి ఎయిడ్స్ వచ్చినట్టు బాధితురాలల్లో ఒకరు తెలిపారు. తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ఆధారంగా.. అతనిపై కేసు నమోదుచేశారు. 2016లో అతని వద్దకు కోచింగ్‌కు వచ్చిన ఒక యువతితో ఫెర్రీ సెక్స్‌లో పాల్గొనగా.. ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె అతడిని పిలిచి అడగ్గా.. ఫెర్రీ దానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె అతని గురించి వాకబు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతని సోషల్ మీడియాలో పలువురితో చాట్ చేసేటప్పుడు ఎయిడ్స్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు.. ఇతర అంశాలు అందులో కనిపించాయి. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది గతనెలలో జరిగిన పోలీసుల విచారణలో ఫెర్రీ  తన నేరాన్ని అంగీకరించాడు. తనకు ఎయిడ్స్ ఉన్న విషయం నిజమేననీ, అయినా అది చెప్పకుండానే చాలా మంది మహిళలతో సెక్స్ చేసినట్టు ఒప్పుకున్నాడు. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లో చాలా మంది మహిళలతో శారీరక సుఖాలు అనుభవించానని అంగీకరించాడు. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. కాగా, ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటున్న ఫెర్రీ బాధితుల్లో ఒకరైన మహిళ అమెరికాలో ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ‘ది నేకెడ్ ట్రూత్’ అనే పుస్తకాన్ని కూడా ఆమె రచించింది. ఫెర్రీకి ఆరేళ్లు శిక్ష పడటంపై ఆమె స్పందించింది. ‘ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు. అతడిని వదలొద్దు’ అంటూ ఎఫ్బీలో ఉద్వేగంగా  పోస్టు పెట్టింది.