భారత్‌కు హిజ్బుల్ చీఫ్ వార్నింగ్.. కశ్మీర్ దహించి వేస్తుందంటూ..
భారత్‌పై మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ విషం చిమ్మాడు. కశ్మీర్ అంశం దావానంలా మారి అది భారత్‌ను దహించి వేస్తుందని హెచ్చరించాడు. ఇటీవల భారత భద్రతా బలగాల చేతిలో హతమైన హిజ్బుల్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ సంతాప సభలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. నైకూ త్యాగం భవిష్యత్ లక్ష్యాలను తమకు మరింత ఎక్కువ చేసిందని పేర్కొన్నాడు. దీంతో సలాహుద్దిన్ వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్‌గా పని చేస్తున్న సయ్యద్ సలాహుద్దీన్ పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నాడు. యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ పేరిట పాక్ అనుకూల శక్తులకు అతడునాయకత్వం వహిస్తున్నాడు. 2017లో అతన్ని అమెరికా గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. కానీ ఐక్యరాజ్యసమితి మాత్రం మాత్రం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీన్ని సాకుగా చూపి పాక్ అతనిపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించడం లేదు. కాగా బుధవారం జమ్మూ కాశ్మీర్ జరిగిన భద్రతా బలగాల ఆపరేషన్‌లో హిజ్బుల్ చీఫ్ కమాండర్ 32 ఏళ్ల రియాజ్ నైకూ మరణం ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బ తీసింది.