భార్యతో గొడవపడి సీఎం ఇంటికే బెదిరింపు కాల్..ఒక‌రి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

భార్యతో గొడవపడి సీఎం ఇంటికే బెదిరింపు కాల్..ఒక‌రి అరెస్ట్

July 11, 2020

Hoax call to tamilandu chief ministe

గత కొన్ని రోజులుగా వరుసగా తమిళనాడులోని సినీ, రాజకీయ నాయకుల ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువైయ్యాయి. ఇటీవల నటులు రజినీకాంత్, విజయ్ ల ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఇంట్లో బాంబు పెట్టానని బెదిరింపు కాల్ వచ్చింది.

గురువారం 4.45 గంట‌ల‌కు చెన్నై పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి సీఎం ఇంట్లో బాంబు పెట్టానని మ‌రికొద్దిసేప‌ట్లో బాంబు పేలుతుంద‌ని చెప్పి కాల్ క‌ట్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తయిన బాంబ్‌ స్క్వాడ్‌ టీమ్ సీఎం ప‌ళ‌నిస్వామి ఇంట్లో గంట‌న్న‌ర పాటు తనిఖీలు చేసి బాంబు లేద‌ని నిర్ధార‌ణ అయ్యింది. తరువాత ఆ ఫోన్ కాల్ తాంబరం సమీపంలోని సేలయూర్ ప్రాంతంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ చేసిన వ్య‌క్తిని ఆటో డ్రైవర్‌ వినోద్‌కుమార్‌(33)గా గుర్తించారు. తాగిన మ‌త్తులో భార్య‌తో గొడ‌వ‌ప‌డి పొరపాటున ఫోన్ చేశాన‌ని అతడు తెలిపాడు.