ధనుష్‌‌ ఇంటికి బాంబు బెదిరింపు - MicTv.in - Telugu News
mictv telugu

ధనుష్‌‌ ఇంటికి బాంబు బెదిరింపు

October 14, 2020

Hoax threat to Tamil star Dhanush

గత కొన్ని నెలలుగా తమిళ సినీ నటీనటుల ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గతంలో రజనీకాంత్‌, విజయ్‌, అజిత్‌, సూర్య ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఓ మానసిక వికలాంగుడు ఈ ఫోన్‌ కాల్స్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తాజాగా మరో ఇద్దరు సినీ ప్రముఖులు విజయకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. 

గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం పోలీస్ కంట్రోల్‌ రూమ్‌కు రెండు సార్లు ఫోన్‌ చేశారు. చెన్నైలోని అభిరామపురంలో గల ధనుష్‌ ఇంటిలో, విరుగంబక్కంలోని విజయకాంత్‌ ఇంట్లో బాంబులు పెట్టారని సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. తమకు వచ్చిన సమాచారంలో నిజం లేదని తేల్చారు. ఈ ఫోన్‌ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.