బాక్సింగ్‌ను తలపించిన హాకీ మ్యాచ్..తన్నుకున్న ఆటగాళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

బాక్సింగ్‌ను తలపించిన హాకీ మ్యాచ్..తన్నుకున్న ఆటగాళ్లు

November 26, 2019

జాతీయ స్థాయి హాకీ ఫైనల్ మ్యాచ్  చూసేందుకు గ్రౌండ్‌కు వెళిన వారిని షాక్‌కు గురయ్యేలా చేసింది. అక్కడికి వెళ్లినవారికి హాకీకి బదులు బాక్సింగ్ టోర్నీ కనిపించింది. నిజానికి అక్కడ జరిగింది హాకీ మ్యాచ్ మాత్రమే. కానీ ఆటగాళ్లు గొడవపడటంతో అది కాస్తా ముష్టి ఘాతానికి దారి తీసింది. హాకీ కర్రలతో రెండు జట్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో అది కాస్తా రణరంగాన్ని తలపించింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రీడా స్పూర్తిని మరిచి వారంతా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. 

జాతీయ స్థాయిలో జరిగే నెహ్రా హాకీ కప్‌ టోర్నమెంట్‌‌లో ఫైనల్ మ్యాచ్ కోసం పంజాబ్‌ పోలీస్‌ జట్టు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ జట్లు పోటీ పడ్డాయి. విజయం కోసం ఎవరికి వారు బలంగా కృషి చేశారు. నువ్వా-నేనా అన్నట్లు  సాగిన ఈ మ్యాచ్‌లో చివరి నిమిషంలో సమానంగా మూడు గోల్స్‌ చేశారు. ఆ సమయంలో పంజాబ్‌ పోలీస్‌ జట్టు.. పీఎన్‌బీతో కాస్త దురుసుగా ప‍్రవర్తించింది. మాట మాట పెరిగి కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గ్రౌండ్‌లోనే హాకీ స్టిక్స్‌తో తలపడుతూ.. గ్రౌండ్ మొత్తం పరిగెత్తాడు. వెంటనే కల్పించుకున్న నిర్వాహకులు ఇరు జట్ల ఆటగాళ్లతో మాట్లాడి గొడవను సద్దుమణిగేలా చేశారు.

 మొత్తానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు జట్టుపై పంజాబ్ పోలీస్ జట్టు విజయం సాధించింది. ఈ ఘటనపై నేషనల్‌ ఫుట్‌బాల్‌ హాకీ ఫెడరేషన్‌ సీరియస్‌ అయ్యింది. ఆటగాళ్ల తీరును తప్పుబడుతూ వెంటనే దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వారు వ్యవహరించిన తీరు చూసి ప్రేక్షకులు కూడా ఒకింత అసహనం వ్యక్తం చేశారు.