మనది కాని ఆటకోసం ఎందుకు ఆరాటం... - MicTv.in - Telugu News
mictv telugu

మనది కాని ఆటకోసం ఎందుకు ఆరాటం…

June 19, 2017

క్రికెట్ మన ఆట కాదు.. హాకీ మన జాతీయ క్రీడా… పొరుగింటి పుల్లకూర అంటే రుచి..బంగారం కాళ్ల కింద కనిపించదు కానీ పక్కన తళతళ మెరిసే వెండే ఆకర్షిస్తోంది. మన మట్టిలో మాణిక్యాలు ఉన్నా అస్సలు కనిపించవు.. తుప్పు పట్టిన వస్తువులైనా పరాయి వాడి దగ్గర ఉంటే వాటిపై మోజు ఎక్కువ..ఎంత సేపు వాటిపైనే ధ్యాస.ఇప్పుడు ఇలాగే ఉంది సగటు భారతీయుడి పరిస్థితి. హాకీ ఇండియా ఎన్ని విజయాలు సాధించినా జనానికి ఎక్కడం లేదు. క్రికెట్ అంటే పడిసచ్చే ఫ్యాన్స్ ఉంటే ఇలాగే ఉంటది. న్యూస్ చానళ్ల హెడ్ లైన్స్ లోనో, పేపర్లోనో వస్తే తప్ప..హాకీ ఆట ఉందని గుర్తుకు రాదు..ఎందుకీలా…హాకీకి హ్యాట్సాఫ్ చెప్పే రోజు..రోజూ రాదా..?ఈ ఆటలో కిక్కు తెలిసేదెలా..?

క్రికెట్..క్రికెట్..క్రికెట్ … గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే.మ్యాచ్ ఉందంటే దేశం ఊగిపోతోంది.ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. రెండురోజుల ముందే నుంచే హడావుడి.వన్డే ,టీ ట్వంటీ, చివరకు టెస్ట్ మ్యాచ్ అయినా ఇంతే. ఏ షాపు, ఏ హోటల్ లో చూసినా క్రికెటే.ఏ నలుగురు కలిసిన క్రికెట్ ముచ్చట్లే.ఇంతలా క్రికెట్ కిక్కు మనకు ఎక్కింది. ఇంగ్లీశోడి మందే కాదు…వారి ఆట కూడా మనతో ఆడుకుంటోంది. మరో ఆటపై మనస్సు పెట్టేలా చేయలే. భవిష్యత్ లో చేయదు కూడానేమో…క్రికెట్ పిచ్చి ఆ లెవల్లో ముదిరిపోయింది.

కానీ ఉన్నట్టుండి అందరికి ఒక్కసారిగా హాకీ ఆట గుర్తు వచ్చింది. హ్యాట్సాఫ్ , కంగ్రాట్స్ హాకీ ఇండియా అంటూ సోషల్ మీడియాలో క్షణాల్లో లక్షల పోస్టులు పోస్ట్ అయ్యాయి. సూపర్…మంచిగుంది.ఎప్పడు ఇలా ఉంటారా… కాదు కదా… ఇప్పుడు ఎక్కడో కాలింది కాబట్టే …హాకీ గుర్తొచ్చింది. నిజమే కదా దేని విలువైనా తెలిసేది పొగొట్టుకున్నప్పడే.

పాక్ చేతిలో ఓడిపోయి టీమిండియా పరువుతీస్తే.. అదే స‌మ‌యంలో అదే ఇంగ్లండ్ గ‌డ్డ‌పై పాక్‌ను చిత్తుగా ఓడించింది ఇండియ‌న్ హాకీ టీమ్‌. హాకీ వ‌ర‌ల్డ్ లీగ్ సెమీస్ టోర్నీలో పాక్‌ను 7-1తో మ‌ట్టిక‌రిపించింది. ఈ విజ‌య‌మే కాదు.. ఈ మ్యాచ్ సంద‌ర్భంగా ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ చేసిన పని అందరి చేత హ్యాట్సాఫ్ అనిపించుకుంటోంది. మ్యాచ్‌కు న‌ల్ల రిబ్బ‌న్లు ధ‌రించి బ‌రిలోకి దిగారు ఇండియ‌న్ ప్లేయ‌ర్స్‌. స‌రిహ‌ద్దులో మ‌న సైనికుల‌పై పాకిస్థాన్ దాడుల‌కు నిర‌స‌న‌గా. ఆట ద్వారా త‌మ నిర‌స‌న‌ను తెల‌పాల‌న్న ఉద్దేశంతోనే ఇలా చేసిన‌ట్లు కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్ చెప్పాడు.
నిజంగా మీరు సూపర్.క్రికెటర్ల కన్నా 100 శాతం బెటర్. హాకీ ప్లేయర్లూ హ్యాట్సాఫ్.