ఫాల్గుణమాసంలో వచ్చే ముఖ్యమైన పండగ హోలీ. ఈ హోలీ పండగను హోలీ పౌర్ణమి అని కూడా అంటారు. హోలీ పండుగ దగ్గరకు వచ్చింది కానీ ఇప్పటి వరకు చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న హోలీ ఎప్పుడు జరుపుకోవాలని. హోలికా దహన్ ఎప్పుడు? హోలీని ఏ తేదీన జరుపుకోవాలి. ఈ ప్రశ్నలన్నింటికి పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
ఫాల్గుణ మాసము విష్ణు భగవానునికి ప్రీతికరము. కృతయుగంలో మహావిష్ణువు నరశింహ అవతారములో హిరణ్యకశిపుడిని సంహరించి విజయము పొందిన రోజును హెూలీ పండుగగా జరుపుకుంటారని భాగవతంలో ఉంది. వసంత ఋతువు ప్రారంభానికి, వసంతోత్సవానికి గుర్తుగా ఈ హెూలీ పండుగను జరుపుతారు. పౌర్ణమి రోజు ఫాల్గుణి నక్షత్రము ఉండుట చేత ఈ పౌర్ణమి హెూలీ పౌర్ణమి అయ్యింది.
ఉత్తర భారతములో హెూలీ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. విష్ణుమూర్తి ఆలయాల్లో వసంతోత్సవాలు ప్రత్యేకంగా హెూలీ పండుగ రోజును జరుపుతారు. ఫాల్గుణ మాసములో వచ్చే అతి ముఖ్యమైన పండుగ హెూలీ పండుగ. ఇది కాముని పండుగ. హెూలీ పండుగ కామదహనము పేరుతో ఎంతో ప్రఖ్యాతి చెందినది. శివుడు మూడో కన్ను నుండి మన్మధుడు దహనము జరిగిన రోజుగా చెబుతుంటారు. దక్షిణ భారతదేశములో శివపార్వతులను, మహావిష్ణువును, కృష్ణుడు, లక్ష్మీదేవిని, మన్మధుడిని హెూలి పండుగ రోజు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. లోక కల్యాణం కోసం, శివపార్వతుల కళ్యాణం జరగడం కోసం ఘోరతపస్సులో ఉన్న శివుని మీదకు మన్మధుడు బాణం వదిలిన రోజు, శివ తపస్సు భగ్నమై మన్మధుడు దహనం జరిగిన రోజుగా పేర్కొన్నారు. దేవతలు పార్వతీదేవి, శివుడికి జరిగిన వృత్తాంతము చెప్పి రతీదేవి సమేతంగా శివుడిని ప్రార్థించగా మన్మధున్ని శివుడు క్షమించి బతికించిన రోజు హెూలీ పౌర్ణమిగా రోజుగా పురాణాలు చెబుతున్నాయి.
హోలీ శుభ సమయం
హోలీ పండుగ ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షంలో జరుపుతారు. ఈ ఏడాది ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి మార్చి 06, 2023న సాయంత్రం 04:17 గంటలకు ప్రారంభమవుతుంది. మార్చి 07, 2023 సాయంత్రం 06:09 గంటలకు ముగుస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుచేసుకుంటారు. ఈ సందర్భంగా ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు హోలికా దహనం చేస్తారు. మరుసటి రోజు అంటే మార్చి 8, 2023నాడు హోలీ పండగ జరుపుకుంటారు.