ఈనెల 13న తేదిన ఏపీలో అన్ని స్కూళ్లకు, షాపులకు సెలవు ప్రకటించారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఈనెల 13వ తేదీన సెలవు దినంగా ప్రకటించింది ఈసీ. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోని షాపులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూతపడనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈసీ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. మార్చి 16న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏపీలో 3 పట్టభద్రుల స్థానాలు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 8 స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలో ఒక స్థానిక సంస్థకు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈసీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది.