రాజమౌళిని సినిమాలు తీయవద్దన్న హాలీవుడ్ నటుడు.. ఎందుకంటే - MicTv.in - Telugu News
mictv telugu

రాజమౌళిని సినిమాలు తీయవద్దన్న హాలీవుడ్ నటుడు.. ఎందుకంటే

May 27, 2022

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. మన భారతీయ సినిమా అభిమానులైతే థియేటర్లలో సినిమా చూసేశారు కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విదేశీ సినిమా అభిమానులు ఇప్పుడు ఓటీటీలో వచ్చింది కాబట్టి చూడగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది సినిమాను మెచ్చుకుంటున్నారు. ఓ హాలీవుడ్ దర్శకుడైతే ‘ఈ సినిమాను మా నాన్న గారికి చూపించాను. ఆయన సినిమా చూసి ఆశ్చర్యపోయారు. తీసిన విధానం ఆయనను విపరీతంగా ఆకట్టుకుంది’ అని అభినందించారు.

ఆ కోవలోనే తాజాగా ఓ హాలీవుడ్ నటుడు ఈ సినిమాను పొగుడుతూ ట్వీట్ చేశారు. పాటన్ ఓస్వాల్ట్ అనే నటుడు ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ చూడాలని కోరుతూ ‘సినిమా అద్భుతంగా ఉంది. మీరు థియేటర్లలో చూడకపోతే ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తప్పక చూడండి. రాజమౌళి గారు.. మీ ఆలోచన, కథ చెప్పిన తీరు, తెరకెక్కించిన విధానం చాలా బాగున్నాయి. మీ ముందు మేం దిగదుడుపే. మీలాంటి వారిని సినిమాలు తీయడానికి అనుమతించకూడదు. మీ తదుపరి చిత్రం కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తుంటా’నని పేర్కొన్నారు. కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.