తొలిసారి..అంతరిక్షంలో సినిమా షూటింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

తొలిసారి..అంతరిక్షంలో సినిమా షూటింగ్

May 6, 2020

hollywood actor Tom Cruise Filming in space

సినిమా షూటింగులకు కోసం అందమైన లొకేషన్ల కోసం సెర్చ్ చేస్తారు. రియల్ లొకేషన్ దొరక్క పొతే భారీ సెట్స్ నిర్మిస్తారు. ఇవేవి సరిపోవని హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ఏకంగా అంతరిక్షంలో సినిమా షూటింగ్ చేయడానికి సిద్ధం అయ్యారు. 

లాక్‌డౌన్ కారణంగా అతడు ప్రస్తుతం నటిస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్’‌ సిరీస్‌లో 8వ భాగం షూటింగ్ వాయిదా పడింది. దీంతో తన కొత్త సినిమాతో సరికొత్త రికార్డ్ సృష్టించే ప్రయత్నంలో ఉన్నాడు. ఇందుకోసం టామ్ క్రూజ్… ఎలోన్ మస్క్ నిర్వహిస్తున్న స్పేస్ ఎక్స్ సంస్థతో చేతులు కలిపారు. తాజా సమాచారం ప్రకారం నాసా సహకారంతో ఈ షూటింగ్ జరుగనుందట. టామ్ క్రూజ్ నటించబోయే ఈ మూవీ అంతరిక్షంలో జరిగే అద్భుతమైన యాక్షన్ చిత్రంగా రూపొందనుందని, అయితే ఇది మిషన్ ఇంపాజిబుల్‌ సిరీస్‌లో పార్ట్ కాదని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియచేస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు.