RRRలో ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్ అందగత్తె..  - MicTv.in - Telugu News
mictv telugu

RRRలో ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్ అందగత్తె.. 

November 20, 2019

hollywood actors Alison Doody and Ray Stevenson are the lead antagonists in RRR and Olivia Morris to romance ntr.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో జూనియర్ ఎన్టీఆర్ సరసన హాలీవుడ్‌ నటి ఒలివియా మోరిస్‌ నటించనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ పీడియాడిక్ ఫిక్షన్ మూవీలో ప్రముఖ  హాలీవుడ్ నటుడురే స్టీవెన్‌సన్‌ విలన్ పాత్రలో నటిస్తారని తెలిపింది. స్టీవెన్‌సన్‌‌కు హాలీవుడ్ భయంకరమైన విలన్ పత్రాలు చేసిన అనుభవం ఉంది. మరో హాలీవుడ్ నటి అలిసన్‌ డూడీ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా వీరి ఫొటోలను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం ట్విటర్‌‌లో షేర్‌ చేసింది.

 

ఈ సినిమాలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమరం భీంగా కనిపించనున్నారు. రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్ నటి ఆలియాభట్‌ నటిస్తుండగా, తారక్‌ సరసన మొదట హాలీవుడ్‌ నటి డైసీ ఎడ్గారీ జోన్స్‌ను తీసుకున్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అతిథి పాత్రలో నటిస్తుండగా.. తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రలో పోషిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న విడుదల కాబోతుంది.