అందాల నటి ఐశ్వర్య రాయితో నటించాలని ఎవరికి ఉండదు. ఆమెతో నటించడానికి చాలామంది నటులు ఉత్సాహం చూపుతారు. కానీ ఓ యువకుడు మాత్రం ఐశ్వర్యతో నటించను అని కరాఖండిగా చెప్పేశాడు. అతను ఎవరో కాదు వివేక్ ఒబెరాయ్ కజిన్ అక్షయ్ ఒబెరాయ్.
అక్షయ్ తో నటించడానికి ఐశ్వర్య ఒప్పుకున్నా అతడు సరేమిరా అనడంతో సదరు సినిమా అటకెక్కింది.
దీనికి కారణం ఐశ్వర్య మాజీ ప్రియుడైన వివేక్ కారణమని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఐష్ తో నటించడానికి అక్షయ్ విముఖత వ్యక్తం చేశాడని జనం అనుకుంటున్నారు. ఫితూర్, పికు సినిమాలతో అక్షయ్ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.