భారీ టిప్ ఇచ్చిన జానీ డెప్.. ఆశ్చర్యపోయిన భారత యజమాని - MicTv.in - Telugu News
mictv telugu

భారీ టిప్ ఇచ్చిన జానీ డెప్.. ఆశ్చర్యపోయిన భారత యజమాని

June 7, 2022

పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమాల సిరీస్‌తో పాపులర్ అయిన హాలీవుడ హీరో జానీడెప్ ఇటీవల తన మాజీ భార్య మీద పరువు నష్టం కేసు వేసి గెలిచిన విషయం తెలిసిందే. దాంతో ఆనందంతో జానీడెప్ టూర్లకు వెళుతున్నాడు. ప్రస్తుతం ప్రముఖ గిటారిస్ట్ జెఫ్ బెక్‌తో కలిసి బ్రిటన్‌లో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 5న బర్మింగ్ హామ్‌లోని ‘వారణాసి భారతీయ రెస్టారెంట్‌’లో భోజనం చేశారు. సాయంత్రం 7 గంటలకు వచ్చిన వారు ముందుగా కాక్ టెయిల్ పార్టీ చేసుకున్నారు. అనంతరం బటర్ చికెన్, పనీర్ టిక్కా మసాలా, లాంబ్ కరాచి, రైస్ వంటి భారతీయ వంటకాలను టేస్ట్ చేశారు. డిన్నర్ పూర్తయిన తర్వాత జానీడెప్ బిల్లు ఎంతయిందన్నది కూడా చూడకుండా టేబుల్‌పై ఏకంగా 50 వేల పౌండ్లను పెట్టి వెళ్లిపోయాడు. ఈ మొత్తానికి భారతీయ కరెన్సీలో చూసుకుంటే రూ. 49 లక్షలవుతుంది. ఇంత భారీ అమౌంట్ రావడంపై హోటల్ యజమాని ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. జానీడెప్ వంటి స్థాయి ఉన్నవారు తమ రెస్టారెంటులో భోజనం చేయడమే గొప్ప అనుకుంటే, ఇంత భారీ స్థాయిలో డబ్బు ఇవ్వడం నిజంగా గొప్ప విషయమని చెప్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు హోటల్ యజమాని అయిన మహమ్మద్ హుస్సేన్. అయితే అసలు భోజనం బిల్లు ఎంతయిందన్నది మాత్రం బయటపెట్టలేదు.