బాపూరే..720 గంటల సినిమా..! - MicTv.in - Telugu News
mictv telugu

బాపూరే..720 గంటల సినిమా..!

July 21, 2017

సినిమా నిడివి ఎంత సమయం ఉంటుంది. ఉంటే రెండు గంటలు.కొన్ని సినిమాలు కథను బట్టి మూడు గంటలు ఉంటాయి.అప్పటికే
ప్రేక్షకులు బోరుకొడుతుంది .అలాంటిది 720 గంటల హాలీవుడ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు స్వీడన్ కు చెందిన దర్శకుడు . అవును వినడానికి
వింతగా ఉంది కదా. ఇది మాత్రం నిజం ఇప్పటివరకు ఏ దర్శకుడు ఇలాంటి సినిమాను తీయలేదు.

స్వీడన్ కు చెందిన అండర్స్ వేబర్గ్ అనే డైరెక్టర్ . 2020 నాటికి సినిమాల నుంచి రిటైర్ మెంట్ తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు.
అందరి లాగా రిటైరేతే ఎలా అని అనుకున్నాడేమో. లాస్టు సినిమాతో చరిత్రను సృష్టించాలని అనుకున్నాడు. అంతేకాకేండా సినిమా
అందరికి ఎప్పటికి గుర్తుంవుండేలా సినీ చరిత్రలోనే అత్యధిక నిడివితో ఓ మూవీ తీయాలని అనుకున్నాడు. 30 రోజులు నాన్ స్టాప్ గా చూసే
సినిమాను తీస్తున్నాడు. అంటే 720 గంటలు అన్నమాట ఈ సినిమాకి యాంబియన్స్ అనే టైటిల్ కూడా ఖరారు చేశాడు.

ఈ సినిమాలో వందమంది నటులు నటిస్తున్నారు. అంతేకాకుండా 720 గంటల ఈ సినిమాలో 400 గంటల సినిమాను కంప్లీట్ చేశారు.
వారానికి 7, 8 గంటలకు సంబంధించి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కానీ ఎక్కువ నిడివి గల సినిమా కావడంతో చిత్రీకరణ కంటే
పోస్ట్ ప్రొడక్షన్ కే ఎక్కువ టైం పడుతుందని . అందుకే పోస్టు ప్రొడక్షన్ పనులను ముందుగానే ప్రారంభించామన్నారు. సినిమా చూస్తున్నంత
సేపు అన్ని సీన్స్ గుర్తుండిపోయేందుకు సినిమాటోగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇప్పటీకే
రెండు విడుదల చేశారు.యాంబియన్స్ ట్రైలర్ ను 7 నిమిషాల నిడివితో 2014 , ఇంకో ట్రైలర్ 2016 లో 7 గంటల నిడివితో రెండోది
విడుదల చేశారు. అంతేకాక 72 గంటలనిడివితో మరో ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.ఈ ట్రైలర్ ను వచ్చే ఏడాదికి విడుదల
చేయనున్నారు. యాంబియన్స్ సినిమాను 2020 డిసెంబర్ 31 విడుదల చేయనున్నట్లు వేబర్గ్ తెలిపారు.