అమెజాన్‌లో హోం డెలివరీ సేవలు బంద్    - MicTv.in - Telugu News
mictv telugu

అమెజాన్‌లో హోం డెలివరీ సేవలు బంద్   

March 18, 2020

Home Delivery Services Stop In Amazon

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను భయపెడుతోంది. దీని కారణంగా ఇల్లు వదిలి బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. చాలా మంది ఇంటి అవసరాల కోసం కూడా కాలు కదపడటం లేదు. ఏదైనా కావాలంటే ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వ్యాధి ప్రభావం తగ్గే వరకు అడుగు బయటపెట్టకపోవడమే మంచిదని అనుకుంటున్నారు. కానీ అమెరికాలో మాత్రం ఇలాంటి అవకాశం కూడా సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. అమెజాన్ తీసుకున్న కీలక నిర్ణయంతో చాలా మంది ప్రజలు డైలమాలో పడిపోయారు.  

కొన్ని రోజుల పాటు తాము హోం డెలివరీ సేవలను బంద్ చేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఏప్రిల్ 5 వరకు ఇది కొనసాగుతుందని వెల్లడించింది. వైద్య సంబంధిత వస్తువువులు, నిత్యావసరాలు, డిమాండ్ ఎక్కవగా ఉన్న వస్తువులను మాత్రం యథావిధిగా సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. ఈ సంచలన నిర్ణయంతో వినియోగదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనికి వినియోగదారులంతా సహకరించాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. కాగా ఇప్పటికే చాలా మంది ప్రజలు ఈ కామర్స్‌కు అలవాటు పడిపోయారు. మరోవైపు కరోనా కారణంగా వీటికి డిమాండ్ కూడా పెరిగిన సంగతి తెలిసిందే.