home guards kidney removed on the pretext of stone operation
mictv telugu

వీళ్లేం డాకర్లు..? కిడ్నీలో రాళ్లు ఉన్నాయని హాస్పిటల్‌కి వెళ్తే..

November 11, 2022

కిడ్నీలో రాళ్లు వచ్చాయని ఓ వ్యక్తి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కి వెళ్లాడు. అక్కడ ఆపరేషన్ చేయించుకున్న కొద్ది రోజులు గడిచిన తర్వాత.. మళ్లీ అతడికి కడుపులో నొప్పి మొదలైంది. దీంతో మరోసారి స్కానింగ్ చేయించుకుని.. ఆ రిపోర్టు రిజల్ట్ చూశాక ఒక్కసారిగా షాకయ్యాడు. తనకున్న రెండు కిడ్నీలలో ఓ కిడ్నీ మాయమైందని గ్రహించాడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం కాస్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని డీఎమ్ నివాసంలో సురేశ్ చంద్ర అనే వ్యక్తి హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 12న వెన్ను నొప్పితో స్థానిక ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేశారు డాక్టర్లు. అతడి ఎడమ కిడ్నీలో రాళ్లు వచ్చినట్లు రిపోర్టులో తేలింది.

దీంతో కుటుంబ సభ్యులు సూచనతో 2 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 14న అలిగఢ్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతడికి కిడ్నీ ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ యథావిధిగా పనికి వెళ్లాడు. అయితేఅక్టోబర్ 29న అతడికి సడెన్గా కపుడు నొప్పి రావడం మొదలైంది. దీంతో మళ్లీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసుకోగా.. రిపోర్టు చూసి విస్తుపోయాడు. రాళ్లను తొలగించేందుకు ఆపరేషన్ చేసేటప్పుడు పొరపాటున అతడి కిడ్నీ తొలగించారు డాక్టర్లు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు సురేశ్ చంద్ర.